Chandrababu: వైసీపీ నేతలు, జగన్‌రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు

Chandrababu: పెన్షన్‌లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు

Jyothi
Published on: 2 April 2024 10:39 AM IST
Chandrababu Comments On CM Jagan
X

Chandrababu: వైసీపీ నేతలు, జగన్‌రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు

Chandrababu: తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఎలోనే ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు, జగన్‌రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అంటూ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఎలోనే ఉందన్నారు. పెన్షన్‌లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్న చంద్రబాబు... ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని తెలిపారు.

పెన్షన్‌ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర అని... తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్దులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదన్నారు. ప్రజలారా కుట్రలను చేదించండి....దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండన్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4వేలకు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story