Chandrababu Naidu,Pawan Kalyan: ముగిసిన చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ టూర్‌..బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు.

Chandrababu Naidu,Pawan Kalyan: ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన చంద్రబాబు, పవన్‌

Shashank Gullapelli
Published on: 9 March 2024 7:05 PM IST
Chandrababu And Pawans Delhi Tour Is Over.. 6 MP Seats And 8 Assembly Seats For BJP
X

Chandrababu Naidu,Pawan Kalyan: ముగిసిన చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ టూర్‌..బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు.

Chandrababu Naidu,Pawan Kalyan: చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ టూర్‌ ముగిసింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఫైనల్‌ కాగా.. హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు చంద్రబాబు, పవన్‌. వచ్చే ముందు ఉమ్మడి ప్రకటనపై ఇరువురు నేతలు సంతకం చేసినట్టు సమాచారం. బీజేపీకి 6 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, హిందూపూర్‌, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. అలాగే.. కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇప్పటికే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. మరి మచిలీపట్నం నుంచి ఎవరిని పోటీకి దించుతుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story