Pawan kalyan: సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కు ఛాంబర్‌ కేటాయింపు

Pawan kalyan: పవన్‌కు 212 రూమ్‌ను సిద్ధం చేస్తున్న అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 Jun 2024 3:45 PM IST
Chamber allotment to Deputy CM Pawan in Secretariat
X

Pawan kalyan: సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కు ఛాంబర్‌ కేటాయింపు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు సచివాల‌యంలో ఛాంబర్ కేటాయించారు సంబంధిత అధికారులు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని ఆయ‌న కోసం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు కేటాయించారు. ప్రస్తుతం ఆయా ఛాంబ‌ర్లలో ఫ‌ర్నిచ‌ర్‌, ఇత‌ర సామాగ్రిని అధికారులు స‌మ‌కూర్చే ప‌నిలో ఉన్నారు. ఎల్లుండి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు పవన్ కల్యాణ్.

చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌ను ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story