Andhra Pradesh: మనబడి, నాడు నేడు పై సమీక్ష: మంత్రి ఓఎస్డి చల్లా పెంచలరెడ్డి

S. Srikanth
Updated on: 23 Jan 2020 6:24 PM IST
Andhra Pradesh: మనబడి, నాడు నేడు పై సమీక్ష: మంత్రి ఓఎస్డి చల్లా పెంచలరెడ్డి
X

ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలను అన్ని వసతులతో అభివృద్ధి చేయుటకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఓఎస్డి చల్లా పెంచలరెడ్డి నేడు నెల్లూరు లోని మంత్రి గారి నివాసంలో ఇంజనీరింగ్ , విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధనా చార్యులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో గల ఆరు మండలాల్లో 132 స్కూల్స్ మొదటి విడతలో అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో ప్రైమరీ స్కూల్స్ 80, యుపి స్కూల్స్ 33 , హై స్కూల్స్ 19 మంజూరు అయ్యాయని తెలిపారు.

అనంతసాగరం, ఏ.యస్.పేట, మర్రిపాడు, ఆత్మకూరు మండలాలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సంగం, చేజర్ల మండలాలు సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు పర్వేక్షణ చేస్తారని తెలిపారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.త్వరలో ఆత్మకూరులో పేరెంట్స్ కమిటీ చైర్మన్స్ , ప్రధానోపాధ్యాయులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నందున అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్,డీ.ఇ.ఇ సతీష్ బాబు, ఆత్మకూరు పంచాయతీ రాజ్ డి.ఇ.ఇ శ్రీనివాసులు , అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story