ఏపీ రాజధాని తరలింపుపై లోక్‌సభలో కేంద్రం ప్రకటన

admin1
Updated on: 4 Feb 2020 4:42 PM IST
ఏపీ రాజధాని తరలింపుపై లోక్‌సభలో కేంద్రం ప్రకటన
X
లోక్‌సభలో గందరగోళం.. గాంధీపై బీజేపీ ఎంపీ హెగ్డే వ్యాఖ్యలపై దుమారం !

తొలిసారిగా మూడు రాజధానుల అంశంపై కేంద్రం అధికారికంగా స్పందించింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. రాజధానిపై నిర్ణయం రాష్ట్రాలదే అంటూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీ రాజధాని తరలింపుపై లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. ఇదే అంశంపై హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత జీవో ప్రకారం అమరావతి రాజధానిగా ఉందని కేంద్రం పేర్కొంది.

admin1

admin1

Next Story