కడప జీఎస్టీ అధికారిపై సీబీఐ కేసు నమోదు

ఇంటి కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి గృహ రుణం చెల్లింపుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

S. Srikanth
Published on: 30 Nov 2019 2:42 PM IST
కడప జీఎస్టీ అధికారిపై సీబీఐ కేసు నమోదు
X
GST - Goods and Service Tax

కడప: ఇంటి కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి గృహ రుణం చెల్లింపుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖ సీబీఐ అధికారుల వివరాల మేరకు షేక్ జమీల్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వ పన్నుల ఇన్స్పెక్టర్ గా కడప జీఎస్టి డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

తన ఆదాయము నుండి ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వానికి చూపారు. ఈ ఫ్లాట్ కు సంబంధించిన రుణాన్ని ఇతరులు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో అహ్మద్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అతని వద్ద నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story