YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై నేడు సీబీఐ కోర్టు విచారణ.. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

YS Viveka Murder Case: ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆరుగురు నిందితులు

Shekhar G
Published on: 14 July 2023 10:11 AM IST
CBI Court Hearing Today On YS Viveka Murder Case
X

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై నేడు సీబీఐ కోర్టు విచారణ.. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. వివేకా హత్య కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.. తప్పుల కారణంగా మెజిస్ట్రేట్ ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపింది. తప్పులు సరి చేసుకుని ఫైనల్ ఛార్జ్‌షీట్‌ను రీసబ్మిట్ చేసింది. ఈ కేసులో జూన్ 30న సీబీఐ దర్యాప్తు ముగిసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆరుగురు నిందితులు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్‌లను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story