వివేకా హత్య పై దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

CBI Arrests Accused Shiv Shankar Reddy in YS Viveka Case
x

వివేకా హత్య పై దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

Highlights

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో ఐదో అనుమానితుడుగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి పులివెందుల కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో ఐదో అనుమానితుడుగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి పులివెందుల కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. కడప కేంద్ర కారాగారంలో దేవిరెడ్డిని కొన్ని గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు అనంతరం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసి ఆపై పులివెందుల కోర్టులో హజరు పరిచారు. అక్కడనుంచి ఆయన్ను మళ్లీ కడప జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో ఐదో అనుమానితుడుగా ఉన్నదేవిరెడ్డికి ఇటీవలే హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ కూడా జరిగింది. ఎంపీ అవినాష్ కు సన్నిహితుడుగా పేరుపడ్డ దేవిరెడ్డి శంకర్ రెడ్డి కూడా వివేకా హత్యకు కుట్రపన్నినవారిలో ప్రధాన నిందితుడని డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం మేరకే దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories