విజయవాడలో దారుణం.. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే..
విజయవాడ: విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర దారుణం జరిగింది. కారుపై ఒక దుండగుడు పెట్రోల్ తో దాడి చేసి, నిప్పు అంటించాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్ రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Next Story




