Wonder Child Hasini : ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు చెప్పేసింది!

Wonder Child Hasini : ప్రతి ఒక్కరిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది.. ఆ టాలెంట్ ని మనం గుర్తించి బయటకు తీసినప్పుడే సక్సెస్ అవుతాం.. తాజాగా

Krishna
Published on: 9 Aug 2020 2:32 PM IST
Wonder Child Hasini : ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు చెప్పేసింది!
X
Hasini

Wonder Child Hasini : ప్రతి ఒక్కరిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది.. ఆ టాలెంట్ ని మనం గుర్తించి బయటకు తీసినప్పుడే సక్సెస్ అవుతాం.. తాజాగా విజయవాడ నగరానికి చెందిన మున్నంగి హాసిని అనే పదేళ్ళ పాప.. తెలుగు సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 సినిమాల పేర్లను 5 నిమిషాలలో చెప్పేసి అందరిని షాక్ కి గురి చేసింది. హాసిని ఐకాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. కృష్ణ తొలిచిత్రం 'తేనె మనుసులు' నుంచి చివరిచిత్రం వరకు ఎక్కడ కూడా ఆపకుండా చెప్పి తన ప్రతిభను చాటుకుంది.

మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవం సందర్భంగా మహేష్ బాబు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 చిత్రాల్లో నటించారని, ఆ చిత్రాల పేర్లు వరుసగా ఎవరైనా చెప్పగలరా? అని అన్నారుల.. మహేష్ బాబు మాటలకు స్ఫూర్తి పొందిన హాసిని వారం రోజుల వ్యవధిలో సినిమా పేర్లను కంఠస్తం చేసింది.

కృష్ణ మొదటి సినిమా 'తేనెమనుసులు', మహేష్‌ బాబు మొదటి సినిమా 'రాజకుమారుడు' సినిమాలు వంద రోజులు ప్రదర్శించబడిన అలంకార్‌ థియేటర్‌లో హాసిని శనివారం ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనలో కృష్ణ నటించిన 346 సినిమాలను అవి విడుదలైన క్రమంలో టకటక చెప్పేసింది. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు గిఫ్ట్‌గా ఈ ప్రదర్శన చేపట్టినట్లు హాసిని తల్లిదండ్రులు వెల్లడించారు.

హాసిని ప్రదర్శనకి గాను సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ సీఐ బాలమురళి, ఆల్‌ ఇండియా సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాస్వామి తదితరులు హాసినిని అభినందించారు.

Krishna

Krishna

Next Story