Buddha Venkanna: ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డను

Buddha Venkanna: తనకు ఏ పదవీ లేకపోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నానని అన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Aug 2024 12:41 PM IST
Buddha Venkanna Sensational Comments In MP Keshineni Chinni Birthday Celebrations
X

Buddha Venkanna: ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డను

Buddha Venkanna: తనకు ఏ పదవీ లేకపోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నానని అన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న... ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల మాటే నెగ్గిందని, ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారని అన్నారు. తన మాట చెల్లలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇతరుల మీద ఆధారపడనని, 2024 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి రక్తంతో కాళ్లు కడిగానని అన్నారాయన.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టిక్కెట్‌ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారని, ఆ విషయం తనకు తెలుసన్నారాయన.. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు చిన్ని... త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు కూడా మంచి పదవులు వస్తాయని, కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం అధైర్య పడవద్దన్నారాయన.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story