Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 09 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి రా.12-18 తదుపరి దశమి | మఖ నక్షత్రం తె.4-05 తదుపరి పుబ్బ | వర్జ్యం సా.4-18 నుంచి 5-52 వరకు | అమృత ఘడియలు రా.1-43 నుంచి 3-18 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-23

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Kakinada Updates: జగన్నాదపురం జమ్మి చెట్టు వద్ద నిన్న అర్ధ రాత్రి దారుణం..
    9 Nov 2020 5:28 AM GMT

    Kakinada Updates: జగన్నాదపురం జమ్మి చెట్టు వద్ద నిన్న అర్ధ రాత్రి దారుణం..

    తూర్పుగోదావరి జిల్లా..

    కాకినాడ..

    -జగన్నాదపురం జమ్మి చెట్టు వద్ద నిన్న అర్ధ రాత్రి మహిళ దారుణ హత్య

    -రమ్య హాస్పిటల్ లో నర్సుగా ఉద్యోగం చేస్తుందన్న స్థానికులు వెల్లడి..దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    -మహిళ మృతి దేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మితం ప్రభుత్వ హాస్పటల్ కి తరలింపు

  • Visakha Updates: గోపాలపట్నం వద్ద రోడ్డు ప్రమాదం!
    9 Nov 2020 5:00 AM GMT

    Visakha Updates: గోపాలపట్నం వద్ద రోడ్డు ప్రమాదం!

    విశాఖ..

    -గోపాలపట్నం వద్ద నిలిపివున్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీ

    -క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్

    -ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు

  • Kurnool District Updates: అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన అంజాద్ భాష..
    9 Nov 2020 4:57 AM GMT

    Kurnool District Updates: అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన అంజాద్ భాష..

    కర్నూలు జిల్లా..

    -నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం అంజాద్ భాష..పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి..

    -మృతుడు సలాం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం...

    -బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా...

  • Vijayawada Updates: కీసర వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం!
    9 Nov 2020 4:55 AM GMT

    Vijayawada Updates: కీసర వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం!

    కృష్ణాజిల్లా..

    -కంచికచర్ల(మం) కీసర వద్ద అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం

    -లారీని పట్టుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు

    -కంచికచర్ల పోలీస్ స్టేషనుకు తరలింపు

  • Anantapur Updates: ఉరవకొండలో విషాదం!
    9 Nov 2020 4:51 AM GMT

    Anantapur Updates: ఉరవకొండలో విషాదం!

    అనంతపురం:

    -ఉరవకొండలో టిడిపి నేత ప్యారం కేశవానంద పై హత్యాయత్నం.

    -రాత్రి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చి కట్టెలు, ఆయుధాలతో దాడి చేసిన దుండగులు.

    -కేశవానంద ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన స్థానికులు.

    -కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు

  • Visakha Updates: ఏజెన్సీలో భారిగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు!
    9 Nov 2020 4:39 AM GMT

    Visakha Updates: ఏజెన్సీలో భారిగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు!

    విశాఖ..

    -మంచుతో కప్పబడిన చింతపల్లి ఏజెన్సీ ప్రాంతం

    -చింతపల్లి లో 11 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు

    -రానున్న రోజుల్లో మరింత తక్కువ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

  • Anantapur District Updates: జిల్లాకు కేంద్ర బృందం రాక!
    9 Nov 2020 4:37 AM GMT

    Anantapur District Updates: జిల్లాకు కేంద్ర బృందం రాక!

    అనంతపురం:

    -వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం.

    -వజ్రకరూరు లో చిత్ర ప్రదర్శన తిలకించనున్న అధికారులు.

    -మండలంలోని రాగులపాడు, గుళ్యపాళ్యం, వజ్రకరూరు గుంతకల్ మండలం నక్కల దొడ్డి, పాత కొత్త చెరువు గ్రామాల్లో పంటలను పరిశీలిస్తారు వేరుశనగ   పరిశీలించనున్న బృందం.

    -రైతులతో ముఖాముఖి అనంతరం హెలికాప్టర్ లో తిరిగి వెళ్లనున్న కేంద్ర బృందం.

  • Chittoor District Updates: పోర్న్ సైట్లో యువతి చిత్రం!
    9 Nov 2020 4:35 AM GMT

    Chittoor District Updates: పోర్న్ సైట్లో యువతి చిత్రం!

    చిత్తూరు జిల్లా..

    -అప్లోడ్ చేసిన యువకుడి అరెస్టు

    -చిత్తూరులో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతిని రహస్యంగా వీడియో చిత్రీకరించి పోర్న్ సైట్లో పోస్ట్ చేసిన యువకుడు

    -యువకుడు వైద్య విద్య ఎంట్రన్స్ కు ఎంపికవడం.. అతడి తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో పోలీసులు గట్టిగా మందలించి రిమాండ్ కు తరలించిన       చిత్తూరు పోలీసులు

    -కొద్దిరోజుల క్రితం ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ములకల చెరువుకు చెందిన యువకుడు చిత్తూరుకు వచ్చి అదే ఆటోలో ఎక్కి ఆమెకు   తెలియకుండానే పక్క నుంచి అసభ్యకరంగా వీడియో చిత్రీకరించిన నిందుతుడు.

    -ఆ వీడియోను ఏకంగా పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన నింధితుడు

  • Visakha Updates: మధురవాడ మిధిలాపురి వుడా కాలనీలో ATM దొంగలు హల్ చల్..
    9 Nov 2020 3:44 AM GMT

    Visakha Updates: మధురవాడ మిధిలాపురి వుడా కాలనీలో ATM దొంగలు హల్ చల్..

    విశాఖ..

    -సెట్రల్ బ్యాంక్ ATM డోర్ పగలుగోట్టిన దొంగలు

    -అలారం మోగడంతో పరారైన ATM దొంగలు

    -ఘటనా స్థలానికి చేరుకున్న PM పాలెం పోలీసులు

  • Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..
    9 Nov 2020 3:35 AM GMT

    Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..

    నెల్లూరు:

    -- ఇన్ ఫ్లో 5174 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 8398 క్యూసెక్కు లు.

    -- ప్రస్తుత నీటి మట్టం 74.575 టీఎంసీ లు .పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు

Print Article
Next Story
More Stories