Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 09 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి రా.12-18 తదుపరి దశమి | మఖ నక్షత్రం తె.4-05 తదుపరి పుబ్బ | వర్జ్యం సా.4-18 నుంచి 5-52 వరకు | అమృత ఘడియలు రా.1-43 నుంచి 3-18 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-23
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Nov 2020 9:02 AM IST
Somashila Project Updates: సోమశిల జలాశయం రెండో దశకు నేడు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన!
నెల్లూరు:
-- సోమశిల జలాశయం హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం రెండో దశకు నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన.
-- దుత్తలూరు వద్ద శిలాఫలకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంఖుస్థపన చేయనున్న సిఎం.
-- హాజరు కానున్న మంత్రులు గౌతమ్, అనీల్,ఎమ్మెల్యేలు.
-- రెండో దశ హై లెవల్ కాలువ ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికీ సోమశిల జలాలు.
- 9 Nov 2020 8:52 AM IST
Krishna District Updates: కృష్ణా జిల్లా మైలవరంలో విషాదం!
కృష్ణా జిల్లా..
-మైలవరం లో కుటుంబ కలహాలతో వివాహిత ఉరి వేసుకుని మృతి
-మృతురాలు మారేపల్లి మాధవి (28)
-మృతికి కారణం భర్త, అత్త మామలు అంటున్న మృతురాలి కుటుంబసభ్యులు
-పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త భరత్, అత్త పుస్పమ్మ, పరారీలో మామ దేవానందం
- 9 Nov 2020 8:49 AM IST
Chittoor District Updates: కశ్మీర్ ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన చిత్తూరు జిల్లా ప్రవీణ్ కుమార్ రెడ్డి..
చిత్తూరు జిల్లా..
-కశ్మీర్ ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి
-గత 18 సంవత్సరాలుగా మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్న జవాను
-అతడు హవల్టార్గా పనిచేస్తూ కమాండో శిక్షణ తీసుకున్న ప్రవీణ్
-ప్రస్తుతం కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్
-వీర జవానుకు భార్య రజిత, కుమారుడు, కుమార్తె తల్లితండ్రులుచీకల ప్రతాప్ రెడి,సుగుణమ్మలు ఉన్నారు
-సోమవారం రాత్రి స్వగ్రామం చేరుకోనున్న వీరజవాన్ భౌతిక కాయం
-రెడ్డిపల్లె గ్రామంలో విషాదఛాయలు
- 9 Nov 2020 8:41 AM IST
Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 32,297 మంది భక్తులు.
-తలనీలాలు సమర్పించిన 10,959మంది భక్తులు.
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు.
-అలిపిరి, విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్న టీటీడీ.
-24 గంటల పాటు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ.







