Kalasapadu: వైభవంగా బ్రహ్మ రథోత్సవం

పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మ రథోత్సవం వైభవంగా జరిగింది.

S. Srikanth
Published on: 10 Feb 2020 6:56 PM IST
Kalasapadu: వైభవంగా బ్రహ్మ రథోత్సవం
X

పులివెందుల: పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల నామస్మరణల మధ్య సతీ సమేతుడైన వెంకటేశ్వరుడు రథంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల మాడవీధులను తలపించేలా కనువిందు చేసింది. దేవుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మెయిన్ బజార్, గంగిరెడ్డి హాస్పిటల్ అమ్మవారి శాల ముందుగా రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


S. Srikanth

S. Srikanth

Next Story