బాలుడు అదృశ్యం

కణితి నిర్వాసిత గవరవీధికి చెందిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు.

S. Srikanth
Published on: 30 Nov 2019 11:04 AM IST
బాలుడు అదృశ్యం
X
సాయి సందీప్‌

గాజువాక: కణితి నిర్వాసిత గవరవీధికి చెందిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న దారపురెడ్డి చంద్రశేఖర్‌ కుమారుడు సాయి సందీప్‌ ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన సాయిసందీప్‌ తిరిగి ఇంటికి రాలేదు.

బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి చంద్రశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిస్తే 94407 96053 నంబరుకి సమాచారం ఇవ్వాలని దువ్వాడ సీఐ కోరారు.

S. Srikanth

S. Srikanth

Next Story