Botsa Satyanarayana: విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం

Botsa Satyanarayana: బొత్స చేత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Aug 2024 5:42 PM IST
Botsa Satyanarayana sworn in as Visakhapatnam MLC
X

Botsa Satyanarayana: విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం

Botsa Satyanarayana: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆయనతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మండలి ప్రతిపక్ష నేత అప్పిరెడ్డి ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్‌కు, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తానని ఆయన అన్నారు. విశాఖ రాజధానే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు బొత్స.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story