ఎమ్మెల్సీ బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Aug 2024 1:00 PM IST
ఎమ్మెల్సీ బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌
X

ఎమ్మెల్సీ బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌

YS Jagan: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు బొత్స సత్యనారాయణ. స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణస్వీకారం చేసేముందు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు.

జగన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్‌.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జడ్పీ ఛైర్‌పర్సన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ సీనియర్‌ నేతలు ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story