Botsa Satyanarayana: వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు

Botsa Satyanarayana: కానీ మా పార్టీ విధానం మాత్రం అదికాదు

Jyothi
Updated on: 14 Feb 2024 2:31 PM IST
Botsa Satyanarayana Key Comments on Common Capital
X

Botsa Satyanarayana: వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు

Botsa Satyanarayana: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలన్న వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉమ్మడి రాజధానిని ఇంకొన్నాళ్లు కొనసాగించాలనేది తమ పార్టీ విధానం కాదని స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానంగానే వైవీ సుబ్బారెడ్డి విభజన హామీల గురించే ప్రస్తావించారని అన్నారు.

పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాజకీయ అనుభవం ఉన్న ఎవరు కూడా రాజధానిపై వ్యాఖ్యలు చేయరని అన్నారు. విభజన హామీల సాధనే తమ పార్టీ విధానమని క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స.

Jyothi

Jyothi

Next Story