చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్

అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ఎదో ఒక హడావుడి చేయాలి కాబట్టి చేస్తున్నారని విమర్శించారు.

admin1
Updated on: 26 Nov 2019 10:45 AM IST
botsa satyanarayana
X
botsa satyanarayana

రాజధాని పేరుతో చంద్రబాబు రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిలో నాలుగు బిల్డింగ్ లు తప్ప ఇంకేమి కట్టలేదన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి ఇచ్చిన ఫ్లాట్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనకు వచ్చి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ఎదో ఒక హడావుడి చేయాలి కాబట్టి చేస్తున్నారని విమర్శించారు. అవినీతిరహిత పాలన అందించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసిందని..ఇది పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదా అన్నారు.

admin1

admin1

Next Story