Botsa Satyanarayana: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తాం

Botsa Satyanarayana Comments On Municipal Sanitation Workers Strike
x

Botsa Satyanarayana: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తాం

Highlights

Botsa Satyanarayana: తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే అమలు చేస్తాం

Botsa Satyanarayana: మున్సిపల్ కార్మికుల మెజార్టీ డిమాండ్లను అంగీకరించామని అన్నారు మంత్రి బొత్స. మున్సిపల్ కార్మికులకు వివిధ కేటగిరీల కింద జీతాలున్నాయని, హెల్త్‌ అలవెన్స్‌ 6 వేల వేతనంతో కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 7 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామన్నారు. మరికొన్ని డిమాండ్లకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందని, మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే ఈ డిమాండ్లన్నింటినీ అమలు చేస్తామన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు బొత్స. అయితే.. ప్రభుత్వంతో జరిగిన చర్చలు తమకు సంతృప్తిగా లేవని, సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు మున్సిపల్‌ కార్మికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories