శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ తారలు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే

K V D Varma
Updated on: 14 Nov 2019 11:59 AM IST
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ తారలు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే
X

తిరుమల, శ్యామ్ నాయుడు

తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ సినీ తారలు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు దర్శించుకున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన వీరు, రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేసారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని, అనంతరం గర్భగుడిలోని శ్రీవారి మూలవిరాట్ ను దర్శించుకున్నారు, అనంతరం హుండీలో కానుకలు చెల్లించి వివాహ మొక్కుబడి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన దీపిక, రణ్ వీర్ లను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు.




K V D Varma

K V D Varma

Next Story