Boat Capsized: సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా

Boat Capsized: విశాఖ ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 25 May 2021 9:42 AM IST
Boat Capsized in Sileru Reservoir
X

Boat Capsized: సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా

Boat Capsized: విశాఖ ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి 8 మంది మృతి చెందారు. ఇందులో చిన్నారి మృత‌దేహం ల‌భ్యమైంది. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాద్ కూలి పనులకు వెళ్ళి లాక్‌డౌన్ వల్ల తిరిగి స్వగ్రామలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన కూలీలది గుంటవాడ, కెందుగుడా గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మల్కాన్ గిరి జిల్లా కెందుగుడ వద్ద ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story