Mandapeta: చంద్రబాబును అడ్డుకోవడం దారుణం: ఎమ్మెల్యే వేగుళ్ళ

Mandapeta: చంద్రబాబును అడ్డుకోవడం దారుణం: ఎమ్మెల్యే వేగుళ్ళ
x
ఎమ్మెల్యే వేగుళ్ళ, నల్లమిల్లి వీర్రెడ్డి, సుబ్బారావు చౌదరి, చిర్ల వెంకటరెడ్డి, కాశిన కాశి విశ్వనాధం
Highlights

ప్రజా చైతన్య యాత్ర పర్యటనలో భాగంగా వైజాగ్, విజయనగరం లలో రెండురోజుల పాటు పర్యటనకు వెళ్ళిన తెలుగుదేశంపార్టి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబు నాయుడు పై వైజాగ్ లో వైకాపా నాయకులు దాడిచేయడం దారుణమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.

మండపేట: ప్రజా చైతన్య యాత్ర పర్యటనలో భాగంగా వైజాగ్, విజయనగరం లలో రెండురోజుల పాటు పర్యటనకు వెళ్ళిన తెలుగుదేశంపార్టి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబు నాయుడు పై వైజాగ్ లో వైకాపా నాయకులు దాడిచేయడం దారుణమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష నాయకు డిపైనే ప్రభుత్వం ఈవిధమైన దాడులు చేయిస్తుందంటే ఒక సామాన్యుడి పరిస్ధితి ఏంటొ అర్ధంకావట్లేదన్నారు.

రెండు రోజుల పాటు పర్యటనకు అనుమతి ఇచ్చినపోలీసులు ఇప్పుడు ఆ పర్యటనను అడ్డుకుని చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చెయ్యడంపై ఆయన మండిపడ్డారు. మంత్రులే అడ్డుకోమని పిలుపు ఇవ్వడం సమంజసం కాదన్నారు. యాత్రను అడ్డుకోమనే వాళ్లు మంత్రులుగా అనర్హులని పేర్కొన్నారు. వందల మంది వైకాపా కార్యకర్తల్ని ఎయిర్ పోర్టులోకి ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన అడ్డుకోవటం దుర్మార్గచర్యగా అభివర్ణించారు.

వైజాగ్ లో పర్యటిస్తే వైకాపా నాయకుల భూ ఆక్రమణలు, అవినీతి దందాలు ఎక్కడ బైటపడతాయన్న ఉద్దేశ్యంతో ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నా రన్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలవల్ల ఇప్పటికే రాష్ట్రానికి వచ్చే లక్షలకోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయన్నారు. ఇటువంటి దృర్మార్గపు పాల నను రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దీనికి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని అన్నారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే శాంతిభద్రతను ఉల్లంఘిస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ చుండ్రు సుబ్బారావు చౌదరి, చిర్ల వెంకటరెడ్డి, కాశిన కాశి విశ్వనాధం, పాలచర్ల శిరీష్, తదితర్లు ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories