BJP: రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం

BJP: ఏపీలో వీడని పొత్తుల ఉత్కంఠ రాజకీయం

Shekhar G
Published on: 5 March 2024 1:50 PM IST
BJP Parliamentary Board Meeting Tomorrow
X

BJP: రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం

BJP: రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఏపీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వనుంది. అయితే.. ఏపీలో పొత్తుల అంశంలో విరుద్ధ వాదనలు వినిపిస్తుండటంతో.. హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఏపీలో బీజేపీతో పొత్తు కావాలని ఒకరు... పొత్తు వద్దని మరొకరు.. పొత్తు లేకుండా ఒంటరి పోరు వెళ్దామని ఇంకొందరు వాదిస్తున్నారు. దీంతో పొత్తుల అంశంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడేక్కుతోంది. ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టీడీపీ-.జనసేన పొత్తుకు బీజేపీ జాయిన్ అవుతుందా.. లేదా.. అన్న అంశంపై ఉత్కంఠ వీడటం లేదు. దీంతో టీడీపీ-జనసేన-వైసీపీ మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇలాంటి క్లిష్టతర.. కష్టతర సమయంలో అందరి చూపు బీజేపీ వైపే ఉంది. మరి బీజేపీతో పొత్తు వికసిస్తుందా.. పెటాకులవుతుందా..? అన్నది ఈ పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్‌లో తేలనుంది.

Shekhar G

Shekhar G

Next Story