Rayachoti: ఎన్నికల దౌర్జన్యాలపై కేంద్రానికి ఫిర్యాదు

స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నేతల దౌర్జన్యం అక్రమాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బిజెపి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

admin1
Published on: 18 March 2020 11:39 AM IST
Rayachoti: ఎన్నికల దౌర్జన్యాలపై కేంద్రానికి ఫిర్యాదు
X

రాయచోటి: స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నేతల దౌర్జన్యం అక్రమాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బిజెపి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వైసిపి ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసులు ఎన్నికల అధికారులు వైసిపి కార్యకర్తలు పని చేశారని ఆరోపించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో జరిగిన దౌర్జన్యాలు, నామ పత్రాల చించివేత, లాక్కొన్నా సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో టిడిపి చేసిన తప్పిదాలే వైసిపి ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

admin1

admin1

Next Story