ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలి : సోము వీర్రాజు

ఏపీ రాజధానిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సంచలన కామెంట్స్ చేశారు. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని.. మరో ఆలోచన లేదన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన సోము వీర్రాజు రాజధాని అంశంపై మాట్లాడారు

admin
Updated on: 14 Dec 2020 8:00 PM IST
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలి : సోము వీర్రాజు
X

ఏపీ రాజధానిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సంచలన కామెంట్స్ చేశారు. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని.. మరో ఆలోచన లేదన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన సోము వీర్రాజు రాజధాని అంశంపై మాట్లాడారు. అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుందన్నారు. ప్రధాని మోడీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటినీ రెండు వేల కోట్లతో బీజేపీ అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని కోరారు.

admin

admin

Next Story