చంద్రబాబు చనిపోయిన పాము: కృష్ణంరాజు తీవ్ర విమర్శలు

K V D Varma
Published on: 28 July 2019 3:28 PM IST
చంద్రబాబు చనిపోయిన పాము: కృష్ణంరాజు తీవ్ర విమర్శలు
X

మాజీ ముఖ్యమంత్రిని చనిపోయిన పాముతో పోలుస్తూ బీజేపీ నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని చులకన చేసిన చంద్రబాబుకు జైలు తప్పదన్నారు. భీమవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అయన మాట్లాడారు. ఎన్నికల ముందు తనను బీజేపీ జైలులో పెడుతుందేమో అని చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నించారనీ, ఇప్పుడు ఇక ఆ సింపతీ కూడా దక్కదనీ అన్నారు.

త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమనీ, తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేననీ చెప్పారు. చిన్నపామును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు. కానీ, చంద్రబాబు చచ్చిన పాము. ఇక కర్రతో పనేముందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

K V D Varma

K V D Varma

Next Story