శ్రీశైలం ఆలయ సమీపంలో పెద్ద పులి సంచారం.. రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించిన పెద్ద పులి

Srisailam సాక్షిగణపతి ఆలయం దగ్గర కన్పించిన పెద్ద పులి

Dhatripriya
Published on: 14 Jun 2023 3:06 PM IST
Big Tiger Spotted On Road Near Sakshi Ganapathi Temple Srisailam
X

శ్రీశైలం ఆలయ సమీపంలో పెద్ద పులి సంచారం.. రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించిన పెద్ద పులి

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల ఆలయ సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. గత రాత్రి పెద్దపులి సాక్షిగణపతి ఆలయం వద్ద రోడ్డు దాటుతూ కనిపించింది. పెద్దపులిని చూసిన స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కమాండర్ జీపులో శ్రీశైలం వెళ్తున్న స్థానికులకు పెద్దపులి సంచరిస్తుండగా పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం పులిసంచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పులిని చూసిన యాత్రికులు భయభ్రాంతులకు గురమయ్యారు. విషయం తెలిసిన అధికారులు భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాలలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story