Bhumana Karunakar Reddy: జగన్‌ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారు

Bhumana Karunakar Reddy: జగన్‌ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 12:46 PM IST
Bhumana Karunakar Reddy: జగన్‌ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారు
X

Bhumana Karunakar Reddy: జగన్‌ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతోందన్నారు. హిందూ ధర్మం అంటే ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతామని... గతంలో ఎన్నో సార్లు శ్రీవారిని జగన్ దర్శించుకున్నారని తెలిపారు. తిరుమల ప్రసాదంపై వేయి నాలుకలతో మాట్లాడే ధోరణిని చంద్రబాబు మానుకోవాలని ఆయన కోరారు. . అనేకసార్లు తిరుమలకు వచ్చిన జగన్‌కు డిక్లరేషన్ ఏంటని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

మా పార్టీ నేతలందరినీ చంద్రబాబు ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆయన ఆరోపించారు. జగన్‌ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీని బట్టి చూస్తే అర్థమవుతోందన్నారు. దేవుడిపై భక్తి లేని వారు జగన్‌ను కట్టడి చేయాలని చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story