Srisailam: శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయం వద్ద ఎలుగుబంటి హల్ చల్

Srisailam: ఎలుగుబంటి దృశ్యాలను వీడియో తీసిన సెక్యూరిటీ సిబ్బంది

Shekhar G
Published on: 14 Aug 2023 12:44 PM IST
Bear At Srisailam Sikhareswaram Temple
X

Srisailam: శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయం వద్ద ఎలుగుబంటి హల్ చల్

Srisailam: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరేశ్వర ఆలయం వద్ద నిన్న రాత్రి ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. శిఖరేశ్వరం గోపురం వద్ద ఉన్న తిరగలి నంది వద్దకు చేరుకున్న ఎలుగుబంటి... భక్తులు వేసిన కొబ్బరి చిప్పలు ప్రసాదాలు తినేందుకు నిత్యం మూడు రోజులుగా అక్కడకు వస్తున్నట్లు గుర్తించారు. అయితే ఎలుగుబంటి అర్ధరాత్రి ఎవ్వరు లేని సమయంలో ఆలయ పరిసరాల్లో తిరుగుతూ.. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కనిపించింది. తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటిని రాత్రి సమయంలో తిరుగుతుండటంతో భయాందోళనలో సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఎలుగుబంట్లు తరచూ శిఖరేశ్వర ఆలయం వద్ద పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్లే ఎలుగుబంట్లు అక్కడకు ఆహారం కోసం సంచరిస్తున్నాయని ఎన్ని నివారణ చర్యలు తీసుకున్న వెలుగుబంట్లు అటవీ ప్రాంతం దగ్గర ఉండడంతో నివారించలేకపోతున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story