బాపట్ల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

Raj
By Raj
Updated on: 18 Nov 2019 3:11 PM IST
బాపట్ల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరి రావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994-99 మధ్యకాలంలో టీడీపీ తరపున బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి కత్తి పద్మారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి మంతెన అనంత వర్మ చేతిలో బాపట్ల నుంచే పోటీ చేసి ఓటిమి చెందారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శేషగిరి రావు పనిచేశారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Raj

Raj

Next Story