వైసీపీకి ఊహించని షాక్.. బాలినేని రాజీనామా?

జగన్ పిలుపుతో రాత్రి సమావేశమైన బాలినేని

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2024 2:10 PM IST
Balineni Srinivasa Reddy to Resign YSRCP
X

వైసీపీకి ఊహించని షాక్.. బాలినేని రాజీనామా?

వైసీపీకి ఏపీ మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న జగన్‌తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు. ఈవీఎంలపై తాను చేస్తోన్న పోరాటానికి పార్టీ సహకరించడంలేదని జగన్‌ను అడిగారు బాలినేని. దీంతో పార్టీకి రాజీనామా చేస్తానని పార్టీ అధినేత జగన్‌తో చెప్పినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story