అందుకే రాజీనామా..! సీఎం జగన్‌ను కలిసిన బాలినేని..

Balineni Srinivasa Reddy: ఏప్రిల్ 29న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన బాలినేని

Dhatripriya
Published on: 2 May 2023 4:15 PM IST
Balineni Srinivasa Reddy Meet CM Jagan
X

అందుకే రాజీనామా..! సీఎం జగన్‌ను కలిసిన బాలినేని..

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని వ్యవహారం తాడేపల్లికి చేరింది. కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్న బాలినేని సీఎం జగన్‌ను కలిశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ అసంతృప్తిలో ఉన్నారు బాలినేని. తమ నియోజకవర్గాల్లో వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారని బాలినేనిపై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు ఫిర్యాదులు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలినేని.. ఏప్రిల్ 29న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేశాక హైకమాండ్ పిలిచినా వెళ్లని బాలినేని మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఎట్టకేలకు సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లి వచ్చారు బాలినేని.

Dhatripriya

Dhatripriya

Next Story