Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలయ్య మాస్ వార్నింగ్..!

Balakrishna: నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.

Arun Chilukuri
Published on: 15 March 2023 3:51 PM IST
Balakrishna Warning To YCP MLA Gopireddy Srinivasa Reddy
X

Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలయ్య మాస్ వార్నింగ్..!

Balakrishna: నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. పొలిటీషన్‌ పొలిటీషన్‌గానే ఉండాలని.. నీచానికి దిగజారకంటూ శ్రీనివాస్‌రెడ్డిని హెచ్చరించారు. బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్‌ రెడ్డిని వేధించినట్లు ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ స్పందించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారన్నారు బాలకృష్ణ. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story