Badvel: చంద్రబాబు పర్యటన అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిరసన

విశాఖలో మాజీ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన వైసీపీ నేతలు, కార్యకర్తలు, అడ్డుకోవడం హేయమైన చర్య అని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు.

S. Srikanth
Published on: 29 Feb 2020 2:06 PM IST
Badvel: చంద్రబాబు పర్యటన అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిరసన
X

బద్వేల్: విశాఖలో మాజీ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన వైసీపీ నేతలు, కార్యకర్తలు, అడ్డుకోవడం హేయమైన చర్య అని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ నేత ఓబుళాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు. నిరసనకు హాజరైన రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు పర్యటనకు అనుమతులు ఇచ్చి వైసీపీ గూండాలు కోడిగుడ్లతో దాడులు చేస్తూ అడ్డుకుంటున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. 9 నెలల్లో వైసీపీ పాలన ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ను తలపిస్తోందన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి చంద్రబాబుకు భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబుపై దాడులకు పాల్పడాలని ప్రయత్నం చేయడం బాబు పర్యటన విజయవంతం అవుతుండడం, ప్రజల్లో రోజు రోజుకూ అభిమానం పెరుగుతుండం తోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నా రు. తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్. విజయమ్మ, షర్మిల, జగన్ మోహన్ రెడ్డి యాత్రలన్ని అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నిరసనలలో భాగంగా నాలుగు రోడ్ల కూడలిలో టీడీపీ నాయకులు , కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా వారిని పక్కకు లాగేశా రు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రంతు, టీడీపీ నేతలు పల్లెం ఎల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ నేత మైఖేల్, దానం, ఐజయ్య, రామ చంద్రారెడ్డి, రమణయ్య, బయన్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story