వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కార్యక్రమం

చిన్న పిల్లల్లో సాధారణంగా ఏడేళ్ల వరకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారికి పుట్టిన నాటినుంచి నిర్ణీత వయస్సు వరకూ వ్యాధినిరోధక టీకాలు ఇవ్వడం మంచిదని హెల్త్ సూపర్ వైజర్ నాగేంద్ర ప్రసాద్ తెలియజేసారు.

S. Srikanth
Published on: 11 Jan 2020 3:39 PM IST
వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కార్యక్రమం
X

కూడేరు: చిన్న పిల్లల్లో సాధారణంగా ఏడేళ్ల వరకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారికి పుట్టిన నాటినుంచి నిర్ణీత వయస్సు వరకూ వ్యాధినిరోధక టీకాలు ఇవ్వడం వల్ల జీవితాంతం ఆయా రోగాల బారి నుంచి అనుక్షణం కాపాడుతుంటాయని సిఎచ్ఓ మోహన్ బాబు, అరవకూరు గ్రామంలో వారు మాట్లాడుతూ ప్రతి బాలిక, బాలుడు ఇమ్యూనైజ్ కావలసిన అవసరం ఉందని, గర్భవతి అయిన ప్రతి మహిళ కూడా తనకు, పుట్టబోయే తన శిశువును టెటనస్ వ్యాధి నుంచి రక్షించుకోవటానికి టిడి వాక్సిన్ వేయించు కోవాలని తెలిపారు.

అంతేగాక, తమ బిడ్డ అనారోగ్యంతో లేదా అంగవైకల్యంతో ఉన్నా లేదా పోషక లోపంతో బాధపడుతున్నా ఇమ్యూనైజ్ చేయటం చాలా సురక్షితమని, ఇమ్యూనైజ్ చేయని పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంతేగాక, శాశ్వత, అంగవైకల్యం లేదా లోపపోషణకు గురై మరణించే ప్రమాదం కూడా ఉందని అందువల్ల ప్రతి శిశువు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు హనుమక్క,చంద్రప్ప,మాధవి ఆషా కార్యకర్తలు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story