Podili: కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీ

మండలం కంభలపాడు గ్రామంలోని బెల్లంకొండ నగర్ లోని బిట్స్ ఫార్మసీ కాలేజీ వారు, కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీని ఆధ్వర్యం మహిళలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

S. Srikanth
Published on: 8 March 2020 10:05 AM IST
Podili: కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీ
X
కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీ

పొదిలి: మండలం కంభలపాడు గ్రామంలోని బెల్లంకొండ నగర్ లోని బిట్స్ ఫార్మసీ కాలేజీ వారు, కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీని ఆధ్వర్యం మహిళలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భగా మహిళలలను, ప్రజలను ఉద్దేశించి బిట్స్ సంస్థల అధినేత డా. బెల్లంకొండ శ్రీనివాసరావు ప్రసంగిస్తూ... ప్రపంచ ప్రముఖ శాస్త్ర వేత్తలు సహితం ప్రపంచ వైద్య విధానం వైపు దృష్టి పెట్టినట్లు అనేక వైరస్ లకు పరిష్కారమార్గాలు భారతీయ ప్రాచీన వైద్య విధానం లో ఉన్నట్లు కనుగొన్నారన్నారు.

ఉడికించిన వెల్లుల్లి, లవంగాల మిశ్రమాన్ని వేడి నీటిలో కలిపి త్రాగితే వైరస్ నశిస్తుందని చైనా వైద్యులే నిరూపించినట్లు తెలియజేశారు. బిట్స్ డైరెక్టర్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తే చాలా వైరస్ ల కు దూరంగా ఉంచవచ్చు నని, ఉదాయాన్నే పరగడుపున లీటర్ గోరు వెచ్చని నీళ్ళు త్రాగాలన్నారు, పసుపు, మిరియాల కషాయాన్ని పాలలో పిల్లలు, పెద్దలు త్రాగితే అనేక వైరస్ లు దూరంగా ఉంచవచ్చునని, అలాగే " ఆర్సెనిక్ ఆల్బమ్30 ఎక్స్ హోమియో మందులు వాడితే వైరస్ నివారించ వచ్చుననీ, త్వరలో బిట్స్ కాలేజి లో మెడిసిన్ ఉచితంగా సరఫరా చేస్తామని ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story