రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలపై అవగాహన సదస్సు

చిట్వేల్ లో ఆర్థిక నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

S. Srikanth
Published on: 13 Dec 2019 1:42 PM IST
రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలపై అవగాహన సదస్సు
X
నారాయణస్వామి రెడ్డి

చిట్వేల్: చిట్వేల్ లో ఆర్థిక నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్ పి కేకే రాజన్, రాజంపేట డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి ఆదేశాల మేరకు చిట్వేల్ లోని ప్రధాన రహదారిపై పాటలు పాడి నాటకాలు ప్రదర్శించారు. పోలీసులు గ్రామాలలో తిరుగుతూ ప్రజలు సుఖంగా జీవించాలని తెలిపారు.

అవగాహన లోపంతో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి ప్రజలకు ఆలోచించాలని, కళా జాతర సభ్యులు ప్రజలకు నాటకాల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలపై బ్యాంకుల వద్ద ఏటీఎం మోసాలపై కళ్లకు కట్టినట్లు నటించారు. బ్రతుకు బ్రతికించు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు సిఐ ఆనందరావు, చిట్వేలి చిట్వేలి ఎస్ఐ సురేష్ బాబు, శంకరయ్య హెడ్ కానిస్టేబుల్ కాటమయ్య, పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story