
విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలను ఏవిధంగా కార్యరూపంలోకి మార్చుకోవాలో వివరించి, ప్రభుత్వం నుంచి చేకూరే వనరుల జాబితా తెలియజేశారు.
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు ఎన్నారై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో నేడు,రేపు ఎల్లుండి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ అర్. వెంకట్రావు తెలియజేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి (అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ.ఎన్.ఆర్.టి) ఎఫైర్స్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్ ఏపీ.యన్.అర్.టీ సొసైటీ మాట్లాడుతూ విద్యార్థి సమాజంలో అవసరమైన విషయాలపై అవగాహన పెంచుకుని దానిపై అధ్యయనం చేసి ఆ సమస్య పరిష్కార దిశగా ఇన్నోవేటివ్ టెక్నికల్ ఐడియా లలో అంకుర సంస్థలను ప్రారంభించి విజయం సాధించవచ్చు అని తెలియజేశారు.
స్ట్రీట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఐడియాస్ కి కార్యరూపం దాల్చే లాగా వర్కింగ్ స్పేసెస్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే దానికి సంసిద్ధంగా ఎన్నో ప్రాజెక్ట్స్ ప్రణాళికలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సక్సెస్ ఫుల్ ఇట్రప్రెన్యూర్షిర్స్ కావలసిన వాళ్లకి ఆత్మస్థైర్యం నాయకత్వ లక్షణాలు క్రిటికల్ థింకింగ్ రిస్క్ మేనేజ్మెంట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి రవితేజ తల్లమ్ మేనేజర్ ఆపరేషన్స్ ట్రిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ డేగ.శ్రీని వాస్ హెడ్ స్టేట్ అర్జీ అండ్ ఆపరేషన్ హీద్రుం టెక్నాలజీస్ ప్రాజెక్టు ప్రిపరేషన్ ఫండింగ్ ఏజెన్సీస్, ఇటర్ప్రెన్యూర్షిప్ అంశాలపై కూలంకషంగా చర్చించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలను ఏవిధంగా కార్యరూపంలోకి మార్చుకోవాలో వివరించి, ప్రభుత్వం నుంచి చేకూరే వనరుల జాబితా తెలియజేశారు. వాటిని ఏ విధంగా సద్వినియోగ పరచుకోవాలి కూడా వివరించారు.
విద్యార్థులకు కలిగినటువంటి సందేహాలు నివృత్తి కొరకు మేధోమథన సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.నాగ భాస్కర్ తెలియజేశారు. ఈ అవగాహనా సదస్సుకు కళాశాల డైరెక్టర్ సిహెచ్. రవి కుమార్, వివిధ విభాగాల అధిపతులు కళాశాల ఉపాధ్యాయులు, ఉత్సాహం కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ అధికారి ఆర్.విజయ్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమకు వచ్చిన ఆలోచన ఆచరణలోకి అమలుపరిచే వరకు వారు ఉత్సాహాన్ని కోల్పోకుండా తమ వంతు కృషి చేయాలని కోరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




