ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఆయనే.. ?

ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఆయనే.. ?
x
Highlights

Atchannaidu : ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు త్వరలోనే ఉండబోతోందా అంటే అవుననే చెప్పాలి. పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని...

Atchannaidu : ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు త్వరలోనే ఉండబోతోందా అంటే అవుననే చెప్పాలి. పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు పేరు అధ్యక్ష రేసులోకి వచ్చింది. ప్రధానంగా అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలుగుదేశం ప్రచారం చేయడంతో, ఆయనపై ప్రజల్లో సింపతీ పెరిగిందనే చర్చ జరుగుతోందట.

అసెంబ్లీలో సైతం ప్రభుత్వంపై ఒంటి కాలితో అచ్చెన్నాయుడు ఎగిరెగిరి పడుతుండటంతో చంద్రబాబు తర్వాత అచ్చెన్నాయుడే ధీశాలి అనే టాక్ పార్టీలో ఉందట. ఈ నేపథ్యంలో, అచ్చెన్నకొచ్చిన సానుభూతి, ఆయన అరెస్టుతో టీడీపీ శ్రేణుల్లో వెల్లువెత్తిన ఆవేశకావేశాలు కంటిన్యూ కావాలంటే, అచ్చెన్నాయుడే రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుంటుందని పార్టీలోని సీనియర్లలో ఎక్కువ మంది అచ్చెన్ననే పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న అభిప్రాయాన్ని అధినేత వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ ఇప్పటికే మండలస్థాయి వరకు దాదాపుగా పూర్తిచేసింది. ఇకపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనున్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తిచేశారు. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తిచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories