Tdp Leader Devineni Uma on AP Govt: టీడీపీ నేతలపై దాడులు చేశారు: దేవినేని ఉమా

DeviNeni Uma (File Photo)
Tdp Leader Devineni Uma on AP Govt: టీడీపీ నేతల బృందంపై మైనింగ్ మాఫియా దాడి చేసిందని ఆ పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Tdp Leader Devineni Uma on AP Govt: టీడీపీ నేతల బృందంపై మైనింగ్ మాఫియా దాడి చేసిందని ఆ పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నేతలు వారికీ ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారని అయన ఆరోపణలు చేసారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బృందం, సజ్జా అజయ్ పై మైనింగ్ మాఫియా దాడి చేసింది. పంచభూతాలను సైతం మింగేస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ చూస్తుండగానే టీడీపీ నేతలపై కొందరు దుర్భాషలాడుతూ, ముష్టిఘాతాలు కురిపించారని అందులో పేర్కొన్నారు. ఈ దాడిలో నందిగామ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి సజ్జా అజయ్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై దేవినేని ఉమా స్పందిస్తూ.. 'నందిగామలో శాండ్ మాఫియానుప్రశ్నించిన విలేకరి గంటానవీన్నుహత్య చేశారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న బృందం,సజ్జాఅజయ్ పై మైనింగ్ మాఫియా దాడి చేశారు. పంచభూతాలను సైతం మింగేస్తున్నారని చెప్పారు. మీ ప్రజాప్రతినిధి దోపిడీ, దౌర్జన్యాలపై ఏం చర్యలు తీసుకుంటారు'. అంటూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసారు..
నందిగామలోశాండ్ మాఫియానుప్రశ్నించిన విలేకరిగంటానవీన్ నుహత్యచేశారు. కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న @PattabhiRamK1 బృందం,సజ్జాఅజయ్ పై మైనింగ్ మాఫియాదాడిచేశారు. పంచభూతాలను సైతంమింగేస్తున్నారని @ncbnచెప్పారు.మీప్రజాప్రతినిధి దోపిడీ,దౌర్జన్యాలపై ఏంచర్యలుతీసుకుంటారు@ysjagan pic.twitter.com/qeBqsWTmt4
— Devineni Uma (@DevineniUma) September 1, 2020