Palakollu: పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం.. రచ్చబండకి వస్తున్న చంద్రబాబు

Palakollu: తడిసిన ధాన్నాన్ని ట్రాక్టర్‌లో తీసుకువస్తున్న రైతులు

Dhatripriya
Published on: 12 May 2023 10:48 AM IST
Argument Between Police and MLA In Palakollu
X

Palakollu: పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం.. రచ్చబండకి వస్తున్న చంద్రబాబు

AP News: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పోలీసులకు స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది. రచ్చబండ కార్యక్రమానికి వస్తున్న చంద్రబాబు నాయుడికి చూపించడానికి తడిసిన ధాన్యాన్ని ట్రాక్టర్ లో తీసుకువస్తున్నారు రైతులు. దీంతో ట్రాక్టర్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులను అడ్డుకున్నవారు పోలీసులా వైసీపీ కార్యకర్తలా అని ప్రశ్నించారు. రైతును అడ్డుకున్న పోలీసు దగ్గర మద్యం తాగిన వాసన వస్తుందని ఎమ్మెల్యే అరోపించారు. పైగా అతనికి యూనిఫామ్ ఐడీ కార్డు కూడా లేదన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story