ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణాకు నడిపే బస్సుల రూట్లు ఇవే!

ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణాకు నడిపే బస్సుల రూట్లు ఇవే!
x
Highlights

తెలంగాణాలో ఏపీఎస్ఆర్టీసీ తాను తిప్పే బస్సుల రూట్లను ప్రకటించింది. గతం కంటె తక్కువగా విజయవాడ నుంచి తెలంగాణాకు బస్సులు నడవనున్నాయి. దాదాపుగా ఇవే రూట్లలో టీఎస్ఆర్టీసీ కూడా బస్సులు తిప్పనున్నట్టు సమాచారం

ఎపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎలా నడపాలనే దానిపై ఇటీవల ఇరు పక్షాల మధ్య ఒప్పందం జరిగిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణాకు నడపబోయే బస్సు సర్వీసుల వివరాలను ప్రకటించింది.

ఆ వివరాల ప్రకారం 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులను ఎపీఎస్ఆర్టీసీ తిప్పనుంది. వీటిలో 534 బస్సులు హైదరాబాద్ కు నడుపుతారు. తెలంగాణా ఇతర ప్రాంతాలకు 104 బస్సులను తిప్పుతారు. ఇక విజయవాడ నుంచి విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్‌లో బస్సుల సంఖ్య బాగా తగ్గింది. గతంలో 264 బస్సుల్ని నడపగా.. ఇప్పుడు 166కు పరిమితమైంది. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్‌కు 1,49,998 కిలోమీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలోమీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేది. కాగా, ఖరారైన బస్సు రూట్లను టీఎస్‌ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ పంపించింది.

టీఎస్‌ఆర్టీసీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ఇవే రూట్లలో తమ సర్వీసులు నడపనుంది. ఈ నెల 2న ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ 452 బస్సులు తెలంగాణకు నడుపుతుండగా.. ఆక్యుపెన్సీ 67 శాతంగా నమోదవుతోంది. 452 బస్సుల్లో 389 హైదరాబాద్‌కు, 63 తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. వీటి ద్వారా ఏపీఎస్‌ ఆర్టీసీకి రోజుకు రూ.68.17 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క హైదరాబాద్‌ రూట్‌ ద్వారా రూ.59.30 లక్షల ఆదాయం వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories