APSRTC విలీన ప్రక్రియ వేగవంతం
ఏపీఎస్సార్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు జగన్ సర్కార్ వర్కింగ్ గ్రూప్‌ను నియమించింది. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయశాఖల ఉన్నతాధికారులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూపును నియమిస్తూ జీవో జారీ చేశారు. ప్రజా రవాణశాఖ ఏర్పాటు, పోస్టులు, డిజిగ్నేషన్ల ఏర్పాటుపై దృష్టి సారించనుంది ఈ గ్రూప్. అలాగే జీతాల చెల్లింపులు, పే- స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను ఖరారు చేయనుంది. వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూపునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story




