Top
logo

గణేశ్‌ ఉత్సవ కమిటీలకు ప్రశంసా పత్రాలు

గణేశ్‌ ఉత్సవ కమిటీలకు  ప్రశంసా పత్రాలు
Highlights

ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గణేశ్‌ ఉత్సవ కమిటీల సభ్యులకు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రశంసా పత్రాలను అందజేసి.. గ్రామంలో ఎలాంటి చందాలు లేకుండా భక్తిశ్రద్ధలతో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించినందుకు అభినందించారు.

కోరుట్ల: ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గణేశ్‌ ఉత్సవ కమిటీల సభ్యులకు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రశంసా పత్రాలను అందజేసి.. గ్రామంలో ఎలాంటి చందాలు లేకుండా భక్తిశ్రద్ధలతో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించినందుకు అభినందించారు. కాగా గురువారం నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గణేష్‌ ఉత్సవాల కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్‌ అంకతి భరత్‌ కుమార్‌, సర్పంచ్‌ సున్నం నవ్యశ్రీ సత్యం, ఎంపీటీసీ దేశేట్టి మమత రాజిరెడ్డి, కెడిసిసిబి జిల్లా డైరెక్టర్‌ అరె రాజ్‌ కుమార్‌, నాయకులు పెంట లింబాద్రి, ఉప సర్పంచ్‌ ఆసతి పెద్దరాజం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాలేపు శంకర్‌, లోక సురేష్‌ ,గుడ్ల సుధాకర్‌,పత్తి అక్షయ్‌, రెడ్డవేన ఎల్లయ్య, ఉప్పులపు గట్టయ్య, రాజారపు లింగం,పుప్పాల రాజేష్‌, ఆసతి శ్రీనివాస్‌, అక్కపెళ్లి శ్రీనివాస్‌, దేవాలయ కమిటీ చైర్మన్‌ పట్నం నర్సయ్య, రాధరపు దేవదాస్‌, రెడ్డవేన అజయ్‌, బస మలేష్‌,బుర్రి ముత్యం,యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story