AP News: ఏపీలో మద్యం షాపుల లైసెన్స్‌లకు కొనసాగుతున్న దరఖాస్తులు

AP News: రాష్ట్ర వ్యాప్తంగా 3,396 షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Oct 2024 10:09 AM IST
AP News: ఏపీలో మద్యం షాపుల లైసెన్స్‌లకు కొనసాగుతున్న దరఖాస్తులు
X

AP News: ఏపీలో మద్యం షాపుల లైసెన్స్ కోసం అప్లికేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 396 షాపులకు గానూ ఇప్పటివరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 153 షాపులకు 855 దరఖాస్తులు వచ్చాయి. స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 షాపులకు 75 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

సత్యసాయి జిల్లాలోనూ 87 షాపులకు 132 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story