Simhachalam: సింహాచలం క్షేత్రంలో అప్పన్నకు పెళ్లిచూపులు ప్రారంభం

Simhachalam: సంప్రదాయబద్ధంగా సింహాద్రినాథుడికి పెళ్లిచూపుల కార్యక్రమం

Jyothi
Published on: 25 March 2024 11:21 AM IST
Appanna Swamy Pelli Chupulu in Simhachalam
X

Simhachalam: సింహాచలం క్షేత్రంలో అప్పన్నకు పెళ్లిచూపులు ప్రారంభం

Simhachalam: సింహాచలం క్షేత్రంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. సింహాద్రినాథుడికి పెళ్లి కుమార్తెను వెతికేందుకు పెళ్లిచూపుల కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరగనుంది. అప్పన్న క్షేత్రంలో ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని ఎంతో వినోదాత్మకంగా జరగనున్న డోలోత్సవాన్ని గ్రామస్థులు బొట్టినడిగే పున్నమి, డోలా పున్నమిగా పిలుస్తారు. స్వామివారి వార్షిక కల్యాణోత్సవానికి ఈ వేడుక తొలి అంకంగా స్థానికులు భావిస్తారు. పైడితల్లి అమ్మవారి కుమార్తెను వివాహమాడేందుకు...స్వామి పరివార సమేతంగా కొండ దిగువకు తరలివచ్చారు. డోలోత్సవం సందర్భంగా నిత్య కళ్యాణ సేవలను అధికారులు రద్దు చేశారు.

Jyothi

Jyothi

Next Story