Vasireddy Padma: రాష్ట్ర మహిళా కమిషన్‌ తరపున ఆర్జీవీకి నోటీసు ఇస్తాం..

Vasireddy Padma: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ వ్యాఖ్యలను ఖండించారు ఏపీ మహిళ కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ.

Arun Chilukuri
Published on: 25 Jun 2022 7:32 PM IST
AP Women Commission Chairperson Vasireddy Padma Slams Ram Gopal Varma
X

Vasireddy Padma: రాష్ట్ర మహిళా కమిషన్‌ తరపున ఆర్జీవీకి నోటీసు ఇస్తాం..

Vasireddy Padma: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ వ్యాఖ్యలను ఖండించారు ఏపీ మహిళ కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ. ఆర్జీవీ వ్యాఖ్యలు బాధాకరమన్న వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్‌ తరపున ఆర్జీవీకి నోటీసు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ నోటీసుపై రామ్‌గోపాల్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

తక్షణమే ఆర్జీవీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు వాసిరెడ్డి పద్మ. ఏపీలో మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. అలాగే లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కోసం సభలా వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు స్పష్టం చేశారు వాసిరెడ్డి పద్మ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story