కంప్యూటర్ ఆపరేటర్ అవమానించారని ఆత్మహత్య చేసుకున్న గ్రామ వాలంటీర్

కంప్యూటర్ ఆపరేటర్ అవమానించారని ఆత్మహత్య చేసుకున్న గ్రామ వాలంటీర్
x
Highlights

కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడని గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.

గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలో గ్రామ వాలంటీర్ పండు నవీన(22) ఆత్మహత్య చేసుకున్న సంగతి మరువక ముందే మరో ఆత్మహత్య చోటు చేసుకుంది.

కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడని గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఇక్కడి తహశీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కంప్యూటర్‌ ఆపరేటర్‌ గుంటూరి శివప్రసాద్‌చారి జుబెడాను అవమానకరంగా మాట్లాడాడు. శుక్రవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన శివప్రసాద్‌చారి.. రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి ఎంఆర్ఓ ఆఫీసుకు తీసుకురావాలని హెచ్చరించారని వివరించింది. అంతేకాదు, సక్రమంగా పనిచేయడం లేదని, ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారని కటువుగా మాట్లాడారని తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జుబేద శనివారం ఉదయం బాత్‌రూమ్ పైనున్న ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కరీమున్‌ చెప్పారు. ప్రస్తుతం శివప్రసాద్‌చారి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories