AP Three Capital Bill Sent For Governor Approval: గవర్నర్‌ ఆమోదానికి 'మూడు రాజధానుల బిల్లులు'

AP Three Capital Bill Sent For Governor Approval: గవర్నర్‌ ఆమోదానికి మూడు రాజధానుల బిల్లులు
x
AP Three Capital Bill Sent For Governor Approval
Highlights

AP Three Capital Bill Sent For Governor Approval: ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్‌ ఆమోదానికి శనివారం పంపించింది.

AP Three Capital Bill Sent For Governor Approval: ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం 'సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు'లను గవర్నర్‌ ఆమోదానికి శనివారం పంపించింది. అసెంబ్లీ అధికారులు ఈ రెండు బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసం పంపారు. 'సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో పెట్టి ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తుండడంతో ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది. ఈ బిల్లులకు గవర్నర్ పరిశీలించి ఆమోదం తెలిపితే వెంటనే వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బిల్లుల విషయంలో గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఆ బిల్లుల్ని ఆమోదించొద్దని వాటిని వెనక్కి పంపించండని అమరావతి రైతులు గవర్నర్‌‌కు లేఖలు రాశారు.

నిజానికి రాష్ట్రం పరిధిలోని బిల్లులకు గవర్నర్‌ ఆమోదం సరిపోతుంది. కానీ కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్న బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్‌ ఆదేశాలివ్వగా అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈ రెండు బిల్లులకు సంబంధించి శాసనమండలిలో వివాదం నడుస్తోంది. ఈ రెండు బిల్లులు మండలి ఆమోదం పొందినట్లు సభాపతి పరిగణించి గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తారు. రెండోసారి ఈ బిల్లుల్ని గతనెల 16న అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. సీఆర్‌డీఏ రద్దు మూడు రాజధానుల బిల్లుల్లోని కొన్ని అంశాలు కేంద్ర చట్టంతో ముడిపడి ఉన్నాయని, రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్‌ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 197 క్లాజ్‌ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories